Ganesh Chaturthi: పీయూష్ గోయల్ నివాసంలో ప్రధాని గణేశ్ పూజ

On Ganesh Chaturthi PM Modi performs aarti at Piyush Goyals residence
  • స్వయంగా హారతి ఇచ్చిన ప్రధాని మోదీ
  • అక్కడకు విచ్చేసిన ప్రజలకు శుభాకాంక్షలు
  • ట్విట్టర్లో ఫొటోలను షేర్ చేసిన ప్రధాని
వినాయక చవితి పండుగ నాడు ప్రధాని నరేంద్ర మోదీ గణపతి పూజలో పాల్గొన్నారు. ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ నివాసానికి వెళ్లారు. వారింట్లో ఏర్పాటు చేసిన వినాయకుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రధాని స్వయంగా తన చేతులతో హారతి ఇచ్చారు. 

లేత పసుపు, కాషాయ రంగును పోలిన కుర్తా, తెల్లటి ధోవతిని ప్రధాని ధరించారు. కాషాయ రంగు అంగవస్త్రాన్ని భుజంపై వేసుకున్నారు. పూజలో పాల్గొనడానికి ముందు పీయూష్ గోయల్ నివాసం వద్దకు చేరుకున్న ప్రజలకు ప్రధాని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. 

పూజకు సంబంధించిన ఫొటోలను ప్రధాని స్వయంగా తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు. ‘‘గణేశ్ చతుర్థి పర్వదినం నాడు నా సహచరుడు పీయూష్ గోయల్ నివాసంలో జరిగిన కార్యక్రమానికి వెళ్లాను. భగవాన్ శ్రీ గణేశ్ ఆశీస్సులు ఎల్లప్పుడూ మనకు ఉండాలి’’ అని ట్వీట్ చేశారు.
Ganesh Chaturthi
Prime Minister
Narendra Modi
performs
puja
Piyush Goyal

More Telugu News