Anantapur District: జిల్లా ఎస్పీపైనే అట్రాసిటీ కేసు నమోదు చేసిన అనంతపురం జిల్లా పోలీసులు

Anantapur police files case against district SP Fakkeerappa

  • జగన్ పర్యటన సందర్భంగా నిరసన వ్యక్తం చేసిన కానిస్టేబుల్ ప్రకాశ్
  • ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ జిల్లా ఎస్పీ ఉత్తర్వులు
  • ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీలపై ప్రకాశ్ ఫిర్యాదు

అనంతపురం జిల్లాలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. సాక్షాత్తు జిల్లా ఎస్పీపైనే అనంతపురం జిల్లా పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే, అనంతపురంలో ఏఆర్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న ప్రకాశ్ ను విధుల నుంచి డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే. ప్రకాశ్ ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ జిల్లా ఎస్పీ ఫకీరప్ప రెండు వారాల క్రితమే ఉత్తర్వులు జారీ చేశారు. 

ముఖ్యమంత్రి జగన్ అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి పర్యటన సమయంలో ప్రకాశ్ నిరసన వ్యక్తం చేశాడు. సేవ్ ఏపీ పోలీస్ అంటూ ప్లకార్డు పట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో, గతంలో ఆయనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి ఆయనను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు. 

ఈ నేపథ్యంలో, కక్ష సాధింపుల్లో భాగంగానే తనను డిస్మిస్ చేశారంటూ ప్రకాశ్ ఆరోపించాడు. అంతేకాదు ఎస్పీ ఫకీరప్ప, ఏఎస్పీ హనుమంతు, డీఎస్పీ మహబూబ్ బాషాలపై అనంతపురం టూటౌన్ పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. ప్రకాశ్ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీలపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. కేసు దర్యాప్తును డీఐజీ రవి ప్రకాశ్ పర్యవేక్షిస్తున్నారు. ఏమైనా, సాక్షాత్తు జిల్లా ఎస్పీపైనే పోలీసులు అట్రాసిటీ కేసు పెట్టడం సంచలనంగా మారింది.

  • Loading...

More Telugu News