Mamata Banerjee: ‘ఆర్ఎస్ఎస్’పై సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలను తప్పుబట్టిన ఒవైసీ

Mamata Banerjee RSS not that bad remark prompts sharp jibe from Owaisi  In 2003 too
  • మమత 2003లోనూ ఆర్ఎస్ఎస్ ను పొగిడినట్టు ప్రకటన
  • ఆమె నిజాయతీ, నిలకడను ప్రశంసించాలంటూ ఎద్దేవా
  • ముస్లిం వ్యతిరేక ద్వేషపూరిత వైఖరే ఆర్ఎస్ఎస్ విధానమంటూ విమర్శలు
ఆర్ఎస్ఎస్ గురించి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి ఆగ్రహం తెప్పించాయి. ‘‘ఆర్ఎస్ఎస్ గతంలో మాదిరి అంత చెడ్డదేమీ కాదు. వారు అంత చెడ్డ వారని (ఆర్ఎస్ఎస్) నేను అనుకోవడం లేదు. ఇప్పటికీ, ఆర్ఎస్ఎస్ లో చాలా మంది మంచి వ్యక్తులు ఉన్నారు. వారు బీజేపీకి మద్దతుగా లేరు. ఏదో ఒక రోజు వారు తమ మౌనాన్ని వీడతారు’’ అంటూ మమతా బెనర్జీ తాజాగా వ్యాఖ్యానించారు. 

దీనికి అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. 2003లోనూ ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మమతా బెనర్జీ చేసిన ప్రశంసలను గుర్తు చేశారు. ముస్లిం వ్యతిరేక ద్వేషపూరిత వైఖరే ఆర్ఎస్ఎస్ విధానమని చరిత్ర చెబుతోందని వ్యాఖ్యానించారు. మమతా బెనర్జీ నిజాయతీ, నిలకడను తృణమూల్ కాంగ్రెస్ లోని ముస్లింలు పొగడాల్సిందేనన్నారు.

‘‘2003లో ఆర్ఎస్ఎస్ ను దేశభక్తి సంస్థగా మమత పేర్కొన్నారు. దీంతో ఆమెను దుర్గగా ఆర్ఎస్ఎస్ అభివర్ణించింది. గుజరాత్ అల్లర్ల తర్వాత పార్లమెంట్ లో బీజేపీకి ఆమె మద్దతుగా నిలిచింది’’ అంటూ మమత వైఖరిని ఒవైసీ తప్పుబట్టారు.
Mamata Banerjee
West Bengal
Asaduddin Owaisi
criticks
remark
jibe

More Telugu News