Sathyadev: 'కృష్ణమ్మ' టైటిల్ సాంగ్ రిలీజ్!

krishnamma title song released
  • సత్యదేవ్ తాజా చిత్రంగా 'కృష్ణమ్మ'
  • కథానాయికగా రాజీ పరిచయం 
  • సంగీత దర్శకుడిగా కాలభైరవ 
  • ఆసక్తిని రేకెత్తిస్తున్న అప్ డేట్స్
సత్యదేవ్ హీరోగా కృష్ణ కొమ్మాలపాటి నిర్మాణంలో .. గోపాలకృష్ణ దర్శకత్వంలో 'కృష్ణమ్మ' సినిమా రూపొందింది. సత్యదేవ్ జోడీగా అథిర రాజీ కథానాయికగా పరిచయమవుతోంది. విభిన్నమైన కథా కథనాలతో రూపొందిన ఈ సినిమాకి కాలభైరవ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాను కొరటాల శివ సమర్పిస్తూ ఉండటం విశేషం.

తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగును రిలీజ్ చేశారు. "కృష్ణమ్మా కృష్ణమ్మా నీలాగే పొంగిందమ్మా మాలో సంతోషం. ఈ కొమ్మా ఆ రెమ్మా చల్లాయి గంధాలేవో మాపై ఈ నిమిషం" అంటూ ఈ పాట సాగుతోంది. అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించాడు.

 కథానాయకుడు .. ఆయనతో ముడిపడిన కొన్ని జీవితాలను .. ఆయన ప్రయాణానికి సంధించిన సన్నివేశాలను టచ్ చేస్తూ కొనసాగిన టైటిల్ సింగ్ ఆకట్టుకునేలా ఉంది. కొంతకాలంగా సరైన హిట్ కోసం సత్యదేవ్ వెయిట్ చేస్తున్నాడు. త్వరలో రానున్న ఈ సినిమా ఆ ముచ్చట తీరుస్తుందేమో చూడాలి.
Sathyadev
Raji
Krishnamma Movie

More Telugu News