Chandrababu: రాష్ట్రం బాగు కోరే ప్రజలు ఈ రెండు చానళ్లను కూడా బహిష్కరించాలి: చంద్రబాబు

Chandrababu calls for boycott TV9 and NTV
  • టీవీ9, ఎన్టీవీ చానళ్లపై చంద్రబాబు ఫైర్
  • విషప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం
  • ఉన్మాదులకు మద్దతు పలుకుతున్నారని విమర్శలు
  • ఇలాంటి వైఖరి ఎప్పుడూ చూడలేదని వెల్లడి
మీడియాలో కొన్ని టీవీ చానళ్లు వ్యవహరిస్తున్న తీరును తన జీవితంలో ఎన్నడూ చూడలేదని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో అరాచకం, అప్రజాస్వామికం రాజ్యమేలుతుంటే తిరిగి విపక్షంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. నీలి మీడియాతో పాటు టీవీ9, ఎన్టీవీలను బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ చానళ్లు ఇష్టానుసారంగా తమపై విషప్రచారం చేస్తున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. 

రాష్ట్రం కోసం పోరాడండి ఒప్పుకుంటాం... కానీ ఉన్మాదులకు వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలొడ్డి పోరాడుతున్న ప్రతిపక్షం ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రం బాగుకోరే ప్రజలందరూ ఈ చానళ్లను బహిష్కరించాలని అన్నారు.
Chandrababu
Channels
Boycott
Media
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News