USA: ఇంటర్వ్యూలు లేకుండానే అమెరికా వీసాలు.. డిసెంబర్ 31 వరకే చాన్స్!

Interview waiver on certain US visa categories
  • కొన్ని నిర్దిష్ట కేటగిరీలకే ఈ వెసులుబాటు వర్తిస్తుందని వెల్లడి
  • గడువు ముగిసిన 48 నెలల్లోపు రెన్యూవల్ చేసుకునేవారికీ వర్తిస్తుందని ప్రకటన
  • కరోనా సమయంలో వీసా రుసుము చెల్లించిన వారికి గడువు పొడిగిస్తున్నట్టు వివరణ
ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే భారతీయులకు వీసాలు మంజూరు చేయాలని అమెరికా నిర్ణయించింది. ఈ మేరకు కాన్సులేట్ అధికారులకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. బీ1, బీ2 వంటి సాధారణ వీసాల జారీ ప్రక్రియ తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే కొన్ని నిర్దిష్ట కేటగిరీల దరఖాస్తు దారులకు మాత్రమే.. అది కూడా ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికల్లా దరఖాస్తు చేసుకున్న వారికే వర్తిస్తుందని స్పష్టం చేసింది.

ఎవరెవరికి.. ఎంతవరకు?
  • ప్రస్తుతం భారతీయులకు జారీ చేస్తున్న వీసాలలో.. ఎఫ్, హెచ్-1, హెచ్-3, హెచ్-4, నాన్ బ్లాంకెట్ ఎల్, ఎం, ఓ, పీ, క్యూ, అకాడమిక్ జే వీసాలను ఇంటర్వ్యూ అవసరం లేకుండానే జారీ చేయనున్నట్టు అమెరికా తెలిపింది.
  • ఇక ఇప్పటికే వీసా గడువు ముగిసిపోయినవారు.. గడువు ముగిసిన తర్వాత 48 నెలల్లోపు రెన్యూవల్ చేయించుకుంటే ఇంటర్వ్యూ లేకుండానే ప్రక్రియ ముగించనున్నట్టు ప్రకటించింది. అయితే గతంలో వీసాలు తిరస్కరణకు గురైన వారికి మాత్రం వర్తించదని పేర్కొంది.
  • ఇంటర్వ్యూల నుంచి మినహాయింపు ఇచ్చినా నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా అపాయింట్‌ మెంట్ల కోసం వేచి ఉండాల్సిన సమయం ఇంకా ఎక్కువే ఉండనుందని.. కరోనా నాటి ఇబ్బందులే దీనికి కారణమని వెల్లడించింది.
  • ఇప్పటికే వీసా దరఖాస్తు రుసుము చెల్లించి ఉన్నవారు ఆందోళన పడవద్దని.. కరోనా వీసా దరఖాస్తు రుసుము చెల్లించినవారికి వీసా ప్రక్రియ గడువును 2023 సెప్టెంబర్ 23వ తేదీ వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది.
USA
Visa
Us Visa
Interview
International

More Telugu News