China: కొత్త సంవత్సరం నేపథ్యంలో అప్రమత్తమైన చైనా.. మళ్లీ లాక్‌డౌన్

Chinese cities rush to lockdown

  • జీరో కొవిడ్ విధానాన్ని పాటిస్తున్న చైనా
  • ప్రయాణాలు పెరిగే అవకాశం ఉండడంతో ఆంక్షలు
  • ఆరు కోట్ల మందిపై ప్రభావం
  • చెంగ్డులో ఇళ్లకే పరిమితమైన 2.1 కోట్లమంది

దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో అప్రమత్తమైన చైనా మరోమారు లాక్‌డౌన్ విధించింది. చైనాలో కొత్త సంవత్సరం కారణంగా ప్రయాణాలు పెరిగే అవకాశం ఉంది. దీంతో వైరస్ వ్యాప్తి మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందని భావించిన ప్రభుత్వం దేశవ్యాప్తంగా 33 నగరాల్లో ఆంక్షలు విధించింది. చైనా తాజా నిర్ణయ ప్రభావం ఆరుకోట్ల మందిపై పడనుంది. 

నైరుతి చైనాలోని చెంగ్డులో 2.1 కోట్ల మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అలాగే, పోర్టు సిటీ టియాంజిన్‌లో 14 కొవిడ్ కేసులు వెలుగు చూడడంతో విద్యాసంస్థలు మూసివేసి ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభించారు. నిన్న దేశవ్యాప్తంగా 1,552 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. నిజానికి ఈ కేసులు తక్కువే అయినా జీరో కొవిడ్ విధానాన్ని అనుసరిస్తున్న చైనా అందులో భాగంగానే లాక్‌డౌన్ ప్రకటించింది.

  • Loading...

More Telugu News