Liz Truss: లిజ్ ట్రస్ కేబినెట్లో రిషి సునాక్ కు చోటు దక్కేనా?

Liz Truss to take oath as UK PM today no white man in key cabinet post
  • మంత్రి పదవి ఇవ్వకపోవచ్చన్న అంచనాలు
  • అదే జరిగితే సంప్రదాయానికి బ్రేక్ పడినట్టే
  • కేబినెట్ కీలక పదవుల్లో తెల్లవారికి స్థానం లేనట్టే
బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతేకాదు, తన కేబినెట్ ను కూడా ఆమె ప్రకటించనున్నారు. తనతో ప్రధాని పదవికి పోటీ పడి, ఓటమి పాలైన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ కు కేబినెట్ లో చోటు దక్కకపోవచ్చని అక్కడి రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మామూలుగా బ్రిటన్ లో ప్రధాని పదవికి పోటీ పడి ఓటమి పాలైన వారికి మంత్రి పదవిని ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. ఒకవేళ రిషి సునాక్ కు మొండి చెయ్యి చూపితే ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయానికి ట్రస్ తిలోదకాలు ఇచ్చినట్టు అవుతుంది.

గార్డియన్ పత్రిక కథనం ప్రకారం.. ట్రస్ కేబినెట్లో కీలక పదవులు తెల్ల జాతీయులకు లభించకపోవచ్చని తెలుస్తోంది. జేమ్స్ క్లవర్లేను విదేశాంగ మంత్రిగా, సుయెల్లా బ్రవెర్ మాన్ ను హోం శాఖ మంత్రిగా, క్వాసి క్వార్టెంగ్ ను చాన్స్ లర్ గా నియమించొచ్చని తెలుస్తోంది. ముందుగా లిజ్ ట్రస్ రాణి ఎలిజబెత్ ను కలవనున్నారు. అనంతరం దేశ తదుపరి ప్రధానిగా ట్రస్ ను రాణి నియమిస్తారు. 

Liz Truss
UK PM
cabinet
rishi sunak

More Telugu News