TS High Court: త‌న భ‌ర్త‌పై పీడీ యాక్ట్ ఎత్తివేయాల‌ని ఎమ్మెల్యే రాజా సింగ్ భార్య పిటిష‌న్‌... తెలంగాణ పోలీసుల‌కు హైకోర్టు నోటీసులు

ts high court issues notices to ts police over pd act on mla raja singh
  • వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల కేసులో అరెస్టైన రాజా సింగ్‌
  • రాజా సింగ్‌పై పీడీ యాక్ట్ కింద కేసు న‌మోదు చేసిన మంగ‌ళ్ హాట్ పోలీసులు
  • రాజా సింగ్ భార్య ఫిర్యాదుపై తెలంగాణ హైకోర్టు విచార‌ణ‌
వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టైన గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై పోలీసులు పీడీ యాక్ట్ కింద కేసు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. మంగ‌ళ్ హాట్ పోలీస్ స్టేష‌న్లో న‌మోదైన కేసు ఆధారంగానే రాజా సింగ్ అరెస్ట‌య్యారు. ఈ క్ర‌మంలో త‌న భ‌ర్త‌పై ప్ర‌యోగించిన పీడీ యాక్ట్‌ను ర‌ద్దు చేయాలంటూ రాజా సింగ్ భార్య తెలంగాణ హైకోర్టును ఆశ్ర‌యించారు. 

ఆమె పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన కోర్టు మంగ‌ళ‌వారం దానిపై విచార‌ణ చేప‌ట్టింది. ఈ సంద‌ర్భంగా రాజా సింగ్‌పై పీడీ యాక్ట్ న‌మోదు చేయ‌డానికి గ‌ల కార‌ణాలు, అందుకు దారి తీసిన ప‌రిణామాల‌ను వివ‌రిస్తూ కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని మంగ‌ళ్ హాట్ పోలీసుల‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
TS High Court
Telangana
TS Police
Raja Singh

More Telugu News