Queen Elizabeth-2: కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ లిజ్ ట్రస్ ను కోరిన బ్రిటన్ రాణి ఎలిజబెత్-2
- బ్రిటన్ కొత్త ప్రధానిగా లిజ్ ట్రస్
- బాల్మొరల్ క్యాజిల్ లో క్వీన్ ఎలిజబెత్-2ని కలిసిన ట్రస్
- ట్రస్ ను ప్రధానిగా నియమించిన బ్రిటన్ రాణి
బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ ఎన్నికైన సంగతి తెలిసిందే. కన్జర్వేటివ్ పార్టీ సహచరుడు రిషి సునాక్ తో పోరులో అంతిమంగా లిజ్ ట్రస్ పైచేయి సాధించారు. నిన్న తుది ఫలితాలు వెల్లడి కాగా, లిజ్ ట్రస్ గెలిచినట్టు అధికారికంగా ప్రకటించారు. కన్జర్వేటివ్ పార్టీ అధినేతగా విజయం సాధించిన ట్రస్ ను బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 ప్రధానిగా నియమించారు.
ఈ నేపథ్యంలో, కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ బ్రిటన్ రాణి నూతన ప్రధాని ట్రస్ ను కోరారు. స్కాట్లాండ్ లోని బాల్మొరల్ క్యాజిల్ లో ఉన్న క్వీన్ ఎలిజబెత్-2తో ట్రస్ ఇవాళ సమావేశమయ్యారు. నూతన ప్రభుత్వ ఏర్పాటుపై రాణి సూచనను అందుకున్న ట్రస్ ఆ మేరకు అంగీకారం తెలిపారు.