Sensex: వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- 168 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 31 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
- 4 శాతానికి పైగా లాభపడ్డ అల్ట్రాటెక్ సిమెంట్ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూలతల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 168 పాయింట్లు నష్టపోయి 59,028కి పడిపోయింది. నిఫ్టీ 31 పాయింట్లు కోల్పోయి 17,624 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (4.37%), విప్రో (0.74%), సన్ ఫార్మా (0.71%), టీసీఎస్ (0.70%), బజాజ్ ఫైనాన్స్ (0.56%).
టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.64%), భారతి ఎయిర్ టెల్ (-1.37%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.34%), మారుతి (-1.15%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.95%).