Pakistan: స్టేడియంలో పాకిస్థాన్ అభిమానులను చితకబాదిన ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్స్.. వీడియోలు ఇవిగో!

Afghanistan fans hits Pakistan fans
  • నిన్న షార్జాలో పాక్, ఆఫ్ఘన్ ల మధ్య మ్యాచ్ 
  • ఒక వికెట్ తేడాతో గెలుపొందిన పాక్
  • ఆఫ్ఘనిస్థాన్ జిందాబాద్ నినాదాలతో మారుమోగిన స్టేడియం
ఆసియా కప్ లో భాగంగా నిన్న షార్జాలో పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా కొనసాగింది. నువ్వా? నేనా? అన్నట్టుగా జరిగిన ఈ మ్యాచ్ లో చివరి ఓవర్ లో ఆఫ్ఘనిస్థాన్ పై పాకిస్థాన్ గెలుపొందింది. ఈ ఓటమిని భరించలేని ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్స్ స్టేడియంలో రచ్చ చేశారు. పాకిస్థాన్ ఫ్యాన్స్ ను చితకబాదారు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఈ గొడవ జరిగింది. పాక్ ఫ్యాన్స్ ను పిడిగుద్దులు గుద్దారు. పాక్ వ్యక్తిని మరో వ్యక్తి కుర్చీతో చితకబాదుతున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా ఆఫ్ఘనిస్థాన్ జిందాబాద్ నినాదాలతో స్టేడియం మారుమోగిపోయింది. 

మరోవైపు ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ 19.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసి విజయం సాధించింది. చివరి ఓవర్లో 11 పరుగులు అవసరమైన దశలో పాక్ పేస్ బౌలర్ నసీమ్ షా వరుసగా రెండు సిక్సర్లు కొట్టి జట్టును గెలిపించాడు. దీంతో పాక్ అభిమానులు కేరింతలు కొట్టారు. దీన్ని తట్టుకోలేని ఆఫ్ఘన్ ఫ్యాన్స్ పాకిస్థాన్ అభిమానులను చితకబాదారు.
Pakistan
Afghanistan
Cricket Match
Fans
Anger

More Telugu News