Iqoo z6 lite 5g: హైస్పీడ్ ప్రాసెసర్, 50 ఎంపీ ట్రిపుల్ కెమెరాతో ఐకూ జెడ్6 లైట్ 5జీ.. ప్రత్యేకతలు, విడుదల తేదీ వివరాలివిగో
- ప్రపంచంలో తొలిసారిగా స్నాప్ డ్రాగన్ 4 జనరేషన్ 1 ప్రాసెసర్ తో ఫోన్
- డ్యూయల్ సిమ్ 5జీ సపోర్టు.. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సదుపాయం
- సెప్టెంబర్ 14వ తేదీ నుంచి విక్రయాలు ప్రారంభిస్తున్నట్టు సంస్థ వెల్లడి
వివో సబ్సిడరీ సంస్థ ఐకూ తమ స్మార్ట్ ఫోన్ల శ్రేణిలో సరికొత్తగా ఐకూ జెడ్6 లైట్ 5జీని మార్కెట్లోకి తీసుకువచ్చింది. ప్రపంచంలోనే మొదటిసారిగా అత్యాధునిక స్నాప్ డ్రాగన్ 4 జనరేషన్ 1 ప్రాసెసర్ ను తమ ఫోన్ లో అమర్చినట్టు ప్రకటించింది. సెప్టెంబర్ 14వ తేదీ నుంచి అమెజాన్ తో పాటు పలు ఈ కామర్స్ వెబ్ సైట్లలో విక్రయించనున్నట్టు ప్రకటించింది. ఈ ఫోన్ రెండు రంగుల్లో లభించనుంది.
ఐకూ జెడ్ 6 లైట్ 5జీ ఫోన్ ప్రత్యేకతలు ఇవీ..
- ఈ ఫోన్ లో అమర్చిన స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్ అత్యంత వేగంగా పనిచేస్తుందని.. మీడియాటెక్ డైమన్సిటీ 700 కంటే వేగవంతమైనదని ఐకూ సంస్థ పేర్కొంది.
- ఫోన్ 2.5 డీ ఫ్లాట్ ఫ్రేమ్ మోడల్ తో అందుబాటులో ఉన్నట్టు కంపెనీ తెలిపింది. వాటర్ డ్రాప్ ఆకారంలోని ఫ్రంట్ కెమెరాతో డిస్ ప్లే అమర్చినట్టు వివరించింది.
- 120 గిగాహెడ్జ్ వేగవంతమైన ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే అమర్చామని.. గేమ్స్ ఆడినప్పుడు అత్యుత్తమ అనుభూతి కలిగేలా 240 గిగాహెడ్జ్ టచ్ సాంప్లింగ్ రేటును సపోర్టు చేస్తుందని తెలిపింది.
- ఇక ఈ ఫోన్ లో వెనుకవైపు 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, ఐ ఆటో ఫోకస్ సదుపాయంతో ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నట్టు వివరించింది.
- 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ను ఈ ఫోన్ సపోర్టు చేస్తుంది. ఒకసారి పూర్తిగా చార్జింగ్ చేస్తే.. 127 గంటలు నిరంతరంగా మ్యూజిక్ వినొచ్చని, 18.51 గంటల యూట్యూబ్ వీడియోలు చూడవచ్చని లేదా 21.6 గంటల పాటు సోషల్ మీడియా యాప్స్ బ్రౌజ్ చేసుకోవచ్చని.. 8.3 గంటలు గేమ్స్ ఆడుకోవచ్చని కంపెనీ పేర్కొంది.
- ఫోన్ కేవలం 8.25 మిల్లీమీటర్ల మందం మాత్రమే ఉన్నట్టు వివరించింది. అయితే ఈ ఫోన్ ధర, మరికొన్ని స్పెసిఫికేషన్ల వివరాలను కంపెనీ వెల్లడించలేదు.