Kiran Abbavaram: అసలైన ఆనందం అంటే ఇదే... తన సినిమా ట్రైలర్ ను పవన్ కల్యాణ్ ఆవిష్కరించడంపై కిరణ్ అబ్బవరం స్పందన

Kiran Abbavaram opines on Pawan Kalyan has launched NMBK trailer
  • కిరణ్ అబ్బవరం హీరోగా 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' చిత్రం 
  • పవన్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్
  • ఓ అభిమానిగా మరపురాని క్షణాలన్న కిరణ్
  • థాంక్యూ పవన్ సర్ అంటూ కృతజ్ఞతలు
తనకు సరిపోయే కథలు ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకాదరణ పొందుతున్న యువ హీరో కిరణ్ అబ్బవరం తాజాగా 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' చిత్రంలో నటించాడు. ఈ చిత్రం ట్రైలర్ టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విడుదలైంది. దాంతో కిరణ్ అబ్బవరం ఆనందం అంతాఇంతా కాదు. 

పవన్ కల్యాణ్ అభిమానిగా తనకు ఇవి మరపురాని క్షణాలని కిరణ్ పేర్కొన్నాడు. అసలు సిసలైన సంతోషం అంటే ఇదేనని అభివర్ణించాడు. థాంక్యూ పవన్ కల్యాణ్ సర్ అంటూ కృతజ్ఞతలు తెలిపాడు. ట్రైలర్ రిలీజ్ సందర్భంగా తాను పవన్ తో కలిసున్న వీడియోను కూడా కిరణ్ అబ్బవరం సోషల్ మీడియాలో పంచుకున్నాడు. 

శ్రీధర్ గాదె దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' చిత్రం సెప్టెంబరు 16న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం సరసన సంజన కథానాయికగా నటించింది. హీరోయిన్ తండ్రిగా సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి నటించడం విశేషం. 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' చిత్రాన్ని దర్శకదిగ్గజం కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్యదీప్తి నిర్మించారు.
Kiran Abbavaram
NMBK
Trailer
Pawan Kalyan
Tollywood

More Telugu News