Sikh: సిక్కు మతాన్ని ఇతర మతాలతో పోల్చడం సరికాదు.. విద్యాసంస్థల్లో హిజాబ్ ధారణ పిటిషన్‌పై సుప్రీంకోర్టు

Dont Compare Sikh Turban and Kirpan With Hijab Says SC

  • విద్యాసంస్థల్లో హిజాబ్ ధారణపై కర్ణాటక హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేసిన న్యాయవాది
  • ముస్లింల హిజాబ్, సిక్కుల తలపాగా ఒకటేనని వాదన
  • సిక్కుల మతాచారాలు దేశ సంస్కృతిలో భాగమన్న న్యాయస్థానం

సిక్కు మతాన్ని ఇతర మతాలతో పోల్చడం సరికాదంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యా సంస్థల్లో హిజాబ్ ధారణపై కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించడం, ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాంశు ధులియాలతో కూడిన ధర్మాసనం నిన్న విచారించింది. పిటిషనర్ తరపు న్యాయవాది నిజాం పాషా తన వాదనలు వినిపిస్తూ.. ముస్లింలు ధరించే హిజాబ్‌ను సిక్కులు ధరించే తలపాగాతో పోల్చారు. ఈ రెండు ఆయా మతాచారాల్లో భాగమని పేర్కొన్నారు.

దీనికి స్పందించిన ధర్మాసనం ఆయన వ్యాఖ్యలను తోసిపుచ్చింది. హిజాబ్‌ను సిక్కుల తలపాగాతో పోల్చడం సరికాదని హితవు పలికింది. సిక్కుల మతాచారాలు దేశ సంస్కృతిలో పూర్తిగా మమేకమైపోయాయని పేర్కొంది. సిక్కుల మతాచారంలోని కేశ్, కారా, కంగా, కచ్చా, కిర్పాన్‌లు స్థిరమైన ఆచారాలుగా ఉన్నాయని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 25వ అధికరణం ప్రకారం సిక్కులు కిర్పాన్ (కడియం) ధరించవచ్చని పేర్కొంది. 

దీనిపై స్పందించిన న్యాయవాది వారికి కిర్పాన్ మాత్రమే ధరించేందుకు అవకాశం ఉందని, మిగిలిన నాలుగింటికి లేవని అన్నారు. దీంతో కలగజేసుకున్న న్యాయస్థానం సిక్కు మతాన్ని ఇతరల మతాలతో పోల్చవద్దని పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ ఈ నెల 12న జరగనుంది.

  • Loading...

More Telugu News