Lord Venkateswara: ఆగస్టు మాసంలో తిరుమల శ్రీవారి ఆదాయం రూ.140 కోట్లు... చరిత్రలో ఇదే అత్యధికం

Record level income for Tirmula Lord Venkateswara in August

  • తగ్గిన కరోనా సంక్షోభం
  • తిరుమలకు పెరిగిన భక్తుల రద్దీ
  • ఆగస్టులో స్వామివారిని దర్శించుకున్న 22 లక్షల మంది
  • స్వామివారికి హుండీ ద్వారా భారీ ఆదాయం

తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి హుండీ నిత్యం కోట్లాది రూపాయలతో కళకళలాడుతుంటుంది. ఇటీవల కరోనా సంక్షోభం తగ్గుముఖం పట్టాక భక్తుల రద్దీ బాగా పెరగడంతో స్వామివారి ఆదాయం కూడా అదే స్థాయిలో పెరిగింది. గత ఆగస్టు మాసంలో రికార్డు స్థాయిలో హుండీ ద్వారా రూ.140.34 కోట్ల ఆదాయం లభించింది. శ్రీవారి ఆలయ చరిత్రలో ఒక నెలలో ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం రావడం ఇదే ప్రథమం. 

ఆగస్టులో తిరుమల వెంకన్నను 22.22 లక్షల మంది దర్శించుకోగా, 1.05 కోట్ల లడ్డూలు విక్రయించారు. స్వామివారికి ఈ ఏడాది జులై మాసంలో హుండీ ద్వారా రూ.139.45 కోట్ల ఆదాయం రాగా, అంతకుముందు మే నెలలో రూ.130.50 కోట్ల ఆదాయం లభించింది.

  • Loading...

More Telugu News