Krishnam Raju: ఆ కోరిక తీరకుండానే తనువు చాలించిన కృష్ణంరాజు

Krishnam Raju passes away before not fulfilling his desire
  • కృష్ణంరాజుకు ప్రభాస్ అంటే ఎంతో ప్రేమ
  • ఎప్పుడూ ప్రభాస్ పెళ్లి గురించే మాట్లాడేవారు
  • చివరకు ప్రభాస్ పెళ్లిని చూడకుండానే తనువు చాలించారు
ప్రముఖ సినీ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ వేకువజామున హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో అనారోగ్య కారణాలతో మృతి చెందారు. ఆయన మృతి వార్తతో కుటుంబ సభ్యులు, అభిమానులు, సన్నిహితులు అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. మరోవైపు, తన చిరకాల కోరిక తీరకుండానే ఆయన మరణించారు. తన తమ్ముడి కుమారుడు ప్రభాస్ అంటే కృష్ణంరాజుకు ఎంతో ప్రేమ. ప్రభాస్ ను ఆయనే సినిమాల్లోకి తీసుకొచ్చారు. ప్రభాస్ ను వెనకుండి నడిపించి పెద్ద స్టార్ ను చేశారు. 

ప్రభాస్, కృష్ణంరాజు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. తనకు పెదనాన్న అంటేనే అందరి కంటే ఎక్కువ భయం అని ఎన్నో సందర్భాల్లో ప్రభాస్ చెప్పాడు. చిన్నప్పటి నుంచి పెదనాన్నను చూస్తూ పెరిగానని, ఆయనను చూసే ఎన్నో విషయాలను నేర్చుకున్నానని చెప్పేవాడు. మరోవైపు, కృష్ణంరాజు ఎప్పుడు మాట్లాడినా ప్రభాస్ పెళ్లి గురించి ప్రస్తావించేవారు. ప్రభాస్ కు మంచి అమ్మాయిని వెతుకుతున్నామని... త్వరలోనే శుభవార్త వింటారని చెపుతుండేవారు. ప్రభాస్ పెళ్లి కంటే తనకు సంతోషాన్ని ఇచ్చే అంశం మరొకటి లేదని చెప్పేవారు. ప్రభాస్ పిల్లలతో కూడా తనకు నటించాలనే  కోరిక ఉందని అంటుండేవారు. అలాంటి కృష్ణంరాజు... ప్రభాస్ పెళ్లిని చూడకుండానే, తన చిరకాల వాంఛ తీరకుండానే తనువు చాలించారు.
Krishnam Raju
Prabhas
Marriage
Tollywood

More Telugu News