Krishnam Raju: మొయినాబాద్ వద్ద ఫాంహౌస్ లో రేపు కృష్ణంరాజు అంత్యక్రియలు

Krishnam Raju last rites will be held at farm house tomorrow
  • టాలీవుడ్ లో తీవ్ర విషాదం
  • సీనియర్ నటుడు కృష్ణంరాజు అస్తమయం
  • హైదరాబాదు నివాసంలో పార్థివదేహం
  • కనకమామిడి ఫాంహౌస్ లో అంత్యక్రియలకు ఏర్పాట్లు
సీనియర్ నటుడు కృష్ణంరాజు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు మొయినాబాద్ వద్ద కనకమామిడి ఫాంహౌస్ లో కృష్ణంరాజు అంత్యక్రియలు జరపాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ప్రస్తుతం కృష్ణంరాజు భౌతికకాయం ప్రజల సందర్శనార్థం ఆయన నివాసం వద్ద ఉంచారు. రేపు మధ్యాహ్నం వరకు అక్కడే ఉంచనున్నారు. కాగా, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియల నేపథ్యంలో, సీఎస్ సోమేశ్ కుమార్ ఆ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 

కృష్ణంరాజు పార్థివదేహాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్, సీనియర్ నటుడు సుమన్ సందర్శించి నివాళులు అర్పించారు. కేటీఆర్ ఈ సందర్భంగా ప్రభాస్ ను ఆత్మీయంగా హత్తుకుని ఓదార్చారు.
Krishnam Raju
Funerals
Farm House
Moinabad
Hyderabad

More Telugu News