Tammineni Sitaram: ఇది ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి చేస్తున్న ఉన్మాద యాత్ర: స్పీకర్ తమ్మినేని

AP Assembly Speaker Tammineni Sitharam comments on Amaravathi farmers Maha Pada Yatra

  • రేపటి నుంచి అమరావతి రైతుల మహాపాదయాత్ర
  • అమరావతి నుంచి అరసవల్లికి యాత్ర
  • ఘాటు వ్యాఖ్యలు చేసిన తమ్మినేని
  • ఉత్తరాంధ్రకు రాజధాని వద్దని చేస్తున్న యాత్ర అంటూ ఆగ్రహం

రాజధాని రైతులు అమరావతి నుంచి అరసవల్లి వరకు ఈ నెల 12 నుంచి చేపడుతున్న మహా పాదయాత్రపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. ఉత్తరాంధ్రపై పాదయాత్ర అసమర్థుల అంతిమయాత్ర అని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రకు రాజధాని వద్దని చేస్తున్న యాత్ర ఇది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి చేస్తున్న ఉన్మాద యాత్ర అని ఘాటుగా విమర్శించారు. ఇలాంటి యాత్రకు ఎవరు అనుమతి ఇస్తారు? అని తమ్మినేని ప్రశ్నించారు. 

ఒకే రాజధాని ఉండడం వల్ల, అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతమవడం వల్ల విభజన సమయంలో ఎంత నష్టపోయామో తెలియదా? అని నిలదీశారు. మూడు రాజధానులతో రాష్ట్రమంతటా అభివృద్ధి జరుగుతుందని అన్నారు. అసెంబ్లీ స్పీకర్ గా మాట్లాడే హక్కు తనకుందని తమ్మినేని ఉద్ఘాటించారు.

  • Loading...

More Telugu News