India: దేశంలో నియంత్రణలో ఉన్న కరోనా వ్యాప్తి

India corona updates

  • గత 24 గంటల్లో 5,221 పాజిటివ్ కేసులు
  • దేశ వ్యాప్తంగా 15 మంది మృతి 
  • దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 47,176

దేశంలో కరోనా వ్యాప్తి నియంత్రణలోనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 5,221 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 5,975 మంది కరోనా నుంచి కోలుకోగా... 15 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశంలో 47,176 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,45,05,801కి చేరుకుంది. వీరిలో 4,39,25,239 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 5,28,165 మంది మరణించారు.  

దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 2.82 శాతంగా, క్రియాశీల రేటు 0.11 శాతంగా, రికవరీ రేటు 98.71 శాతంగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 2,15,26,13,049 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న 30,76,305 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.

  • Loading...

More Telugu News