Sensex: మరోసారి 60 వేల పాయింట్లను దాటిన సెన్సెక్స్
- 321 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
- 103 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 2.39 శాతం పెరిగిన టైటాన్ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. సెన్సెక్స్ మరోసారి 60 వేల పాయింట్ల మార్క్ ను దాటింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 321 పాయింట్లు లాభపడి 60,115కి చేరుకుంది. నిఫ్టీ 103 పాయింట్లు పుంజుకుని 17,936కి పెరిగింది. ఈరోజు అన్ని సూచీలు లాభాల్లో ముగిశాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టైటాన్ (2.39%), యాక్సిస్ బ్యాంక్ (2.08%), టెక్ మహీంద్రా (2.05%), టాటా స్టీల్ (1.84%), ఇన్ఫోసిస్ (1.57%).
టాప్ లూజర్స్:
నెస్లే ఇండియా (-0.65%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-0.43%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.40%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.30%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.30%).