Chiranjeevi: 'గాడ్ ఫాదర్' నుంచి సత్యదేవ్ ఫస్టు లుక్ పోస్టర్!

God Father movie poster released
  • 'గాడ్ ఫాదర్'గా చిరంజీవి 
  • దర్శకుడిగా మోహన్ రాజా 
  • సంగీత దర్శకుడిగా తమన్
  • కీలకమైన పాత్రలో నయన్ 
  • అక్టోబర్ 5వ తేదీన సినిమా రిలీజ్
చిరంజీవి కథానాయకుడిగా 'గాడ్ ఫాదర్' సినిమా రూపొందుతోంది. ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి, మోహన్ రాజా  దర్శకత్వం వహించాడు. మలయాళంలో మోహన్ లాల్ కి ప్రశంసలు తెచ్చిపెట్టిన 'లూసిఫర్' సినిమాకి ఇది రీమేక్. దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఈ సినిమా నుంచి ఆయా పాత్రల ప్రాధాన్యతను బట్టి ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్స్ ను వదులుతూ వెళుతున్నారు. రీసెంట్ గా 'సత్యప్రియ'గా నయనతార పాత్రను పరిచయం చేస్తూ ఆమె లుక్ ను రిలీజ్ చేశారు. 

ఇక ఇప్పుడు సత్యదేవ్ పోషించిన 'జైదేవ్' పాత్రకి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో సత్యదేవ్ డీసెంట్ లుక్ తో ఆకట్టుకునేలా ఉన్నాడు. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. 'సైరా' తరువాత చిరంజీవి నుంచి వస్తున్న ఈ సినిమాపై అందరిలోను అంచనాలు ఉన్నాయి.
Chiranjeevi
Nayanatara
Sathyadev
God Father Movie

More Telugu News