National Essential Medicines: జాతీయ అవశ్యక ఔషధాల జాబితా నుంచి 26 మందుల తొలగింపు

Center releases national essential medicines list

  • జాతీయ అవశ్యక ఔషధాల జాబితా విడుదల చేసిన కేంద్రం
  • కొత్తగా 34 ఔషధాలకు జాబితాలో స్థానం
  • మొత్తం 384కి చేరిన అవశ్యక ఔషధాల సంఖ్య

కేంద్ర ప్రభుత్వం జాతీయ అవశ్యక ఔషధాల జాబితా నుంచి 26 మందులను తొలగించింది. గ్యాస్ట్రిక్ సంబంధింత సమస్యలకు వాడే రానిటిడైన్, జింటాక్, రాంటాక్ వంటి ఔషధాలు కూడా తొలగించిన మందుల్లో ఉన్నాయి. ఈ మందుల్లో క్యాన్సర్ కారక ఎన్ నైట్రోసోడిమిథైలమిన్ ఉందంటూ వాటిని తొలగించినట్టు తెలుస్తోంది. ఇవేకాకుండా, అటెనోలోల్, వైట్ పెట్రోలేటమ్, సుక్రాల్ఫేట్, మిథైల్ డోపా వంటి మందులు కూడా జాతీయ అవశ్యక ఔషధ హోదా కోల్పోయాయి. 

ఇక, ఈ జాబితాలో కొత్తగా 34 మందులకు స్థానం కల్పించారు. దాంతో అవశ్యక ఔషధాల సంఖ్య 384కి చేరింది. కొత్తగా చేర్చిన ఔషధాల్లో ఐవర్ మెక్టిన్, అమికాసిన్, డెలామానిడ్, ఇట్రాకొనాజోల్ ఎబిసి డొలుటెగ్రావిర్, బెడాక్విలిన్, మెరోపెనెమ్, సెఫురోక్సిమ్, మాంటెలుకాస్ట్, లాటానోప్రోస్ట్, ప్లూడ్రోకార్టిసాన్, ఇన్సులిన్ గ్లార్జిన్, ఓర్కెలోక్సిఫశ్రీన్, యాంటీ బయాటిక్ మందులు, క్యాన్సర్ చికిత్స ఔషధాలు ఉన్నాయి. జాతీయ అవశ్యక ఔషధాల జాబితాలో ఉన్న మందుల ధరలు మరింత తగ్గే అవకాశం ఉంటుంది.

  • Loading...

More Telugu News