Sensex: నాలుగు రోజుల బుల్ జోరుకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- 224 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 66 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- మన మార్కెట్లపై ప్రభావం చూపిన అమెరికా ద్రవ్యోల్బణం
దేశీయ స్టాక్ మార్కెట్లలో నాలుగు రోజుల బుల్ జోరుకు బ్రేక్ పడింది. ఈరోజు మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరగడం మన మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. దీంతో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 224 పాయింట్ల నష్టంతో 60,346కి పడిపోయింది. నిఫ్టీ 66 పాయింట్లు కోల్పోయి 18,003కి దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (4.48%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.58%), ఎన్టీపీసీ (2.57%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.39%), కోటక్ బ్యాంక్ (1.70%).
టాప్ లూజర్స్:
ఇన్ఫోసిస్ (-4.53%), టీసీఎస్ (-3.36%), టెక్ మహీంద్రా (-2.61%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-2.44%), ఎల్ అండ్ టీ (-1.83%).