Andhra Pradesh: అమ‌రావ‌తిలో ఉద్యోగుల ఉచిత వ‌స‌తి మ‌రో ఏడాది పొడిగింపు

ap government exteds free accomodation to employees for one more year

  • 2023 జూన్ 26 వ‌ర‌కు ఉద్యోగుల‌కు ఉచిత వ‌స‌తి
  • ఉత్త‌ర్వులు జారీ చేసిన సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ‌
  • గుంటూరు, విజ‌య‌వాడ‌ల్లో ప‌నిచేస్తున్న ఉద్యోగుల అంశాన్ని ప్ర‌స్తావించ‌ని ప్ర‌భుత్వం

రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో హైద‌రాబాద్ నుంచి వ‌చ్చి ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో ప‌నిచేస్తున్న ఉద్యోగుల‌కు క‌ల్పిస్తున్న ఉచిత వ‌స‌తిని మ‌రో ఏడాది పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు బుధ‌వారం సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ ఉద్యోగుల ఉచిత వ‌స‌తిని 2023 జూన్ 26వ‌ర‌కు పొడిగిస్తూ అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. 

అమ‌రావ‌తిలోని స‌చివాల‌యం, శాస‌న‌స‌భ‌, ఆయా శాఖాధిప‌తుల కార్యాల‌యాలు, హైకోర్టు, రాజ్ భ‌వ‌న్‌ల‌లో ప‌నిచేస్తున్న ఉద్యోగుల‌కు మాత్ర‌మే ఈ ఉచిత వ‌స‌తి వ‌ర్తిస్తుంద‌ని ప్ర‌భుత్వం త‌న ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. అయితే గుంటూరు, విజ‌యవాడ‌ల్లోని వివిధ ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో ప‌నిచేస్తున్న ఉద్యోగుల‌కు 2024 వ‌ర‌కు ఉచిత వ‌స‌తిని పొడిగించాల‌ని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఈ అంశాన్ని ప్ర‌భుత్వం త‌న ఉత్త‌ర్వుల్లో ప్ర‌స్తావించ‌లేదు.

  • Loading...

More Telugu News