Maulana Masood Azhar: మౌలానా మసూద్ అజార్ మా దేశంలో లేడు.. మీ దేశంలోనే ఉన్నాడు: పాకిస్థాన్ కు స్పష్టం చేసిన ఆప్ఘనిస్థాన్

Maulana Masood Azhar is in Pakistan says Afghanistan
  • మసూద్ ను అరెస్ట్ చేయాలని ఆఫ్ఘాన్ కు పాక్ లేఖ
  • తమ దేశంలో మసూద్ ఉన్నాడనే ఆరోపణలను ఖండించిన ఆఫ్ఘాన్
  • ఆరోపణలకు ఆధారాలు చూపాలని డిమాండ్
నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ మీ దేశంలో ఎక్కడున్నాడో చెప్పాలని, ఆయనను అరెస్ట్ చేయాలని ఆఫ్ఘనిస్థాన్ కు పాకిస్థాన్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కు ఆప్ఘనిస్థాన్ ఘాటు సమాధానాన్ని ఇచ్చింది. మసూద్ అజాద్ మీ పాకిస్థాన్ లోనే ఉన్నాడని ఆప్ఘనిస్థాన్ ప్రభుత్వం తెలిపింది. తమ దేశంలో అజార్ ఉన్నాడనే పాకిస్థాన్ ఆరోపణలను ఆఫ్ఘాన్ విదేశాంగ శాఖ ఖండించింది. తమపై ఇలాంటి ఆరోపణలను మరోసారి చేస్తే... అది రెండు దేశాల సంబంధాలపై ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించింది. అజార్ తమ దేశంలో ఉన్నాడనే ఆరోపణలకు స్పష్టమైన ఆధారాలను చూపాలని డిమాండ్ చేసింది.
Maulana Masood Azhar
Afghanistan
Pakistan

More Telugu News