Ayyanna Patrudu: రోజా కూడా ఆరోజు అమరావతికి ఓకే చెప్పారు: అయ్యన్న పాత్రుడు

Ayyanna Patrudu fires on Tammineni
  • స్పీకర్ స్థానంలో ఉండి అమరావతి రైతుల పట్ల తమ్మినేని దారుణంగా మాట్లాడుతున్నారన్న అయ్యన్న 
  • పాదయాత్రను అడ్డుకుంటామని మంత్రులు అంటున్నారని విమర్శ 
  • జగన్ పాదయాత్రకు టీడీపీ అన్ని సౌకర్యాలను కల్పించిందని వెల్లడి 
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ స్పీకర్ స్థానంలో ఉండి అమరావతి రైతుల పట్ల దారుణంగా మాట్లాడుతున్నారని అన్నారు. గతంలో మంత్రి రోజా కూడా అమరావతికి అనుకూలంగా మాట్లాడారని చెప్పారు. అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకుంటామని మంత్రులు అంటున్నారని... వాళ్లకేమైనా బుద్ధి ఉందా? అని ప్రశ్నించారు. జగన్ పాదయాత్రకు అప్పట్లో టీడీపీ అన్ని సౌకర్యాలను కల్పించిందని చెప్పారు. మోదీ దగ్గరకు వెళ్లి జగన్ గది తలుపులేసుకుంటున్నారని... అక్కడ ఆయన ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు.
Ayyanna Patrudu
Telugudesam
Jagan
Tammineni Sitaram
YSRCP
Amaravati
Roja

More Telugu News