BJP: కృష్ణంరాజు సంస్మ‌ర‌ణ స‌భ కోసం రేపు హైద‌రాబాద్‌కు రాజ్‌నాథ్ సింగ్‌

union minister raj nath singh will attends krishnam raju memorial meeting tomorrow
  • కృష్ణంరాజు కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించ‌నున్న రాజ్‌నాథ్‌
  • క్ష‌త్రియ సంఘం ఆధ్వ‌ర్యంలో జ‌రిగే సంస్మ‌ర‌ణ స‌భ‌కు హాజ‌రు
  • కేవ‌లం 2.30 గంట‌లు మాత్ర‌మే హైద‌రాబాద్‌లో ఉండ‌నున్న కేంద్ర మంత్రి
ఇటీవ‌లే మృతి చెందిన టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు సంస్మ‌ర‌ణ స‌భ‌లో పాలుపంచుకునే నిమిత్తం భార‌త ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్ర‌వారం హైద‌రాబాద్‌కు రానున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో జూబ్లీ హిల్స్‌లోని కృష్ణంరాజు ఇంటికి వెళ్ల‌నున్న రాజ్‌నాథ్‌... రెబ‌ల్ స్టార్ కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చ‌నున్నారు. అనంత‌రం క్ష‌త్రియ సంఘం ఆధ్వ‌ర్యంలో జ‌రిగే కృష్ణంరాజు సంస్మ‌ర‌ణ స‌భ‌కు ఆయ‌న హాజ‌రుకానున్నారు. ఈ సంద‌ర్భంగా కేవ‌లం 2.30 గంట‌లు మాత్ర‌మే రాజ్‌నాథ్ హైద‌రాబాద్‌లో ఉండ‌నున్నారు. 

శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం ప్ర‌త్యేక విమానంలో ఢిల్లీ నుంచి బ‌య‌లుదేర‌నున్న రాజ్‌నాథ్ సింగ్‌... మ‌ధ్యాహ్నం 2 గంట‌ల స‌మ‌యంలో హైద‌రాబాద్‌లోని బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా జూబ్లీహిల్స్‌లోని కృష్ణంరాజు ఇంటికి చేరుకుని, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు సంతాపం ప్ర‌క‌టిస్తారు. అనంతరం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఫిల్మ్ న‌గ‌ర్‌లో జ‌ర‌గ‌నున్న కృష్ణంరాజు సంస్మ‌ర‌ణ స‌భ‌కు ఆయ‌న హాజ‌రు అవుతారు. ఈ కార్య‌క్ర‌మం అనంత‌రం సాయంత్రం 4.20 గంట‌ల‌కు రాజ్‌నాథ్ ఢిల్లీకి తిరుగు ప్ర‌యాణం కానున్నారు.
BJP
Krishnam Raju
Tollywood
Raj Nath Singh
Hyderabad

More Telugu News