YSRTP: వైఎస్​ఆర్​ను కుట్ర చేసి చంపారు.. నన్నూ అలానే చంపాలని చూస్తున్నారు: షర్మిల

YSRTP Chieef YS Sharmlia sensational comments over YSR death
  • తన పాదయాత్రను ఏ క్షణమైన అడ్డుకోవచ్చని వ్యాఖ్య
  • తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పిన షర్మిల
  • తాను పులి బిడ్డనని, బేడీలకు భయపడనని స్పష్టం చేసిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు 
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కుట్ర చేసి చంపారని ఆమె ఆరోపించారు. తనను కూడా అలాగే  చంపాలని చూస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఉమ్మడి  మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతున్న తన  ప్రజా ప్రస్థానం పాదయాత్రలో షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ క్షణమైనా పాదయాత్రను అడ్డుకుని తనను అరెస్ట్ చేయవచ్చని ఆమె అన్నారు. అయితే తాను బేడీలకు భయపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. 

మంత్రి నిరంజన్ రెడ్డి పై విమర్శలు చేసినందుకు తనపై కేసు పెట్టారని షర్మిల తెలిపారు. కానీ తనపై ఆయన చేసిన విమర్శల మీద పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదని చెప్పారు. తాను పులి బిడ్డనన్న షర్మిల తనకు భయం లేదని దమ్ముంటే తనని అరెస్ట్ చేయాలంటూ సవాల్ విసిరారు. ఊపిరి ఉన్నంత వరకు ప్రజలనుంచి తనని దూరం చేయలేరని ఆమె స్పష్టం చేశారు.
YSRTP
YS Sharmila
comments
YSR
DEATH

More Telugu News