Arvind Kejriwal: ఈ ఆరు పాయింట్ల అజెండాతో భారత్ ను నెంబర్ వన్ దేశంగా చేస్తా: కేజ్రీవాల్
- ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ సదస్సు
- జాతీయ అజెండాను ఆవిష్కరించిన కేజ్రీవాల్
- 130 కోట్ల మంది ప్రజలతో జట్టు కట్టాలని పిలుపు
ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తమ పార్టీ జాతీయ అజెండాను ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహించిన మొదటి జాతీయ స్థాయి సదస్సు 'రాష్ట్రీయ జనప్రతినిధి సమ్మేళన్'లో 6 పాయింట్ల అజెండాను ఆవిష్కరించారు. ఈ అజెండాతో భారత్ ను ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశంగా మార్చుతానని తెలిపారు.
భారత్ అగ్రగామిగా నిలవాలంటే దేశంలోని 130 కోట్ల మంది ప్రజలతో మనం తప్పనిసరిగా పొత్తు కుదుర్చుకోవాలి అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల ద్వారా జాతీయస్థాయిలో మరింత విస్తరించాలన్నది ఆమ్ ఆద్మీ పార్టీ ప్రణాళిక. ఆ మేరకు ఆరు పాయింట్లతో అజెండా రూపొందించారు.
హెల్త్ కేర్, ప్రపంచస్థాయి మౌలిక వసతులు, ఉద్యోగ భద్రత, మహిళలకు అవకాశాలు వంటి అంశాలు ఈ అజెండాలో ఉన్నాయి.
1. అందరికీ మెరుగైన ఆరోగ్య సదుపాయాలు
2. ఐదేళ్లలో భారత్ లో దారిద్ర్య నిర్మూలన
3. ప్రతి యువతీయువకుడికి ఉద్యోగ ఉపాధి
4. మహిళలకు సమాన అవకాశాలు, భద్రత
5. ప్రపంచస్థాయి మౌలిక వసతులు
6. వ్యవసాయ పంటలకు పూర్తిస్థాయి మద్దతు ధరలు