Samalu: చిరుధాన్యాల్లో ఒకటైన సామలు ఎంత మేలు చేస్తాయో తెలుసా...?
- శరీర ఆరోగ్యానికి చిరుధాన్యాలు
- చిరుధాన్యాల్లో సమృద్ధిగా పోషక పదార్థాలు
- సామల్లో అధికంగా పీచు పదార్థం
- థైరాయిడ్, రక్త క్యాన్సర్ నియంత్రణకు సామలు ప్రయోజనకరం
శరీరానికి తగిన పోషకాలు అందాలంటే చిరుధాన్యాలు కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటుండాలని డాక్టర్లు చెబుతుంటారు. మనకు అందుబాటులో ఉండే చిరుధాన్యాల్లో సామలు కూడా ఒకటి.
ఆరోగ్యంగా ఉండేందుకు ఇవి ఎంతో దోహదపడతాయి. నిత్యం సామలను ఆహారంగా తీసుకుంటే అనేక అనారోగ్య సమస్యలను నివారించవచ్చు.
సామల్లో పీచు పదార్థం (ఫైబర్) అధికంగా ఉంటుంది. అందువల్ల ఇది త్వరగా జీర్ణమవుతుంది. ఇందులోని పీచు పదార్థం అనేక రోగాలకు మూలకారణమైన మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది.
అంతేకాదు, థైరాయిడ్, బ్లడ్ క్యాన్సర్ నియంత్రణకు సామలు ఎంతో ప్రయోజనకరం అని పలు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.
సామలతో మరో ప్రయోజనం కూడా ఉంది. దీనివల్ల హార్మోన్ల అసమతౌల్యతకు సంబంధించిన సమస్యలను ఇది కట్టడి చేస్తుందట.