Andhra Pradesh: వీధి లైట్ల ఏర్పాటుకు 3 నెల‌ల స‌మ‌యం కావాల‌న్న ఏపీ స‌ర్కారు... 2 నెల‌ల్లో ఏర్పాటు చేయాల‌న్న హైకోర్టు

ap high court orders ap gevernment to install street lights in 2 months

  • హైకోర్టుకు వెళ్లే దారిలో వీధి లైట్లు లేని వైనంపై దాఖ‌లైన పిటిష‌న్‌
  • పిటిష‌న్ వేసిన హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్య‌క్షుడు వేణుగోపాలరావు
  • 3 నెల‌ల గ‌డువు కోరిన రాష్ట్ర ప్ర‌భుత్వ త‌ర‌ఫు న్యాయ‌వాది
  • రాష్ట్ర ప్ర‌భుత్వ విన‌తిని తిర‌స్క‌రించిన న్యాయ‌మూర్తి

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలోని ఏపీ హైకోర్టుకు వెళ్లే ర‌హ‌దారిపై వీధి లైట్ల ఏర్పాటుకు సంబంధించి బుధవారం హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. హైకోర్టుకు వెళ్లే దారిలో వీధి లైట్లు లేక‌పోవ‌డం, రోడ్డు కూడా అస్త‌వ్య‌స్తంగా ఉండ‌టంతో ఉద్యోగులతో పాటు న్యాయ‌వాదులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని, త‌క్ష‌ణ‌మే ఈ ర‌హ‌దారిపై వీధి లైట్లు ఏర్పాటు చేసేలా ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేయాల‌ని కోరుతూ హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్య‌క్షుడు వేణుగోపాల‌రావు ఓ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్‌పై బుధ‌వారం జ‌రిగిన విచార‌ణ‌లో హైకోర్టు కీల‌క ఆదేశాలు జారీ చేసింది.

విచార‌ణ సంద‌ర్భంగా హైకోర్టుకు వెళ్లే ర‌హ‌దారిపై 60 రోజుల్లోగా వీధి లైట్ల‌ను ఏర్పాటు చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వానికి హైకోర్టు సూచించింది. ఈ ప్ర‌తిపాద‌న‌కు స్పందించిన ప్ర‌భుత్వ త‌ర‌ఫు న్యాయ‌వాది... లైట్ల ఏర్పాటుకు క‌నీసం 3 నెల‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని, ఆ మేర‌కు 3 నెల‌ల గ‌డువు ఇవ్వాల‌ని కోరారు. ఈ విన‌తిని నిర్ద్వంద్వంగా తిర‌స్క‌రించిన హైకోర్టు... ఈ ప‌నుల‌ను 2 నెల‌ల్లోగానే పూర్తి చేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News