Rangoli: అంటార్కిటికా మంచు మీద ఓనమ్​ ముగ్గు.. ఆనంద్​ మహీంద్రా షేర్​ చేసిన వీడియో ఇదిగో

Rangoli art on ice in antarctica

  • కొందరు యువకులు కలిసి గడ్డకట్టిన సముద్రంపై ముగ్గు వేసిన తీరు
  • చిన్నపాటి సుత్తెలు, స్క్రూ డ్రైవర్ల వంటి వాటితో మంచును చెక్కి రూపకల్పన
  • ‘భారతీయులు ఎక్కడున్నా పండుగలను వదలరు’ అంటూ వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో

కేరళ ప్రజలకు ఓనమ్ చాలా పెద్ద పండుగ. ఆ రాష్ట్ర వాసులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఓనమ్ పండుగను ఘనంగా జరుపుకుంటారు. మనం సంక్రాంతికి ముగ్గులు వేసినట్టుగా వాళ్లు ఓనమ్ సందర్భంగా వివిధ డిజైన్లు, రంగుల్లో రంగోలీలను వేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో అంటార్కిటికాలో గడ్డ కట్టిన మంచు మీద రంగోలి ముగ్గును చెక్కిన వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది.

సుత్తెలు, స్క్రూ డ్రైవర్లతో..
  • అంటార్కిటికాలో మైనస్ డిగ్రీల్లో ఉష్ణోగ్రతలు ఉంటాయి. మంచు బాగా గడ్డకట్టి ఉంటుంది. అలా సరస్సులాంటి దానిపై గడ్డకట్టిన మంచుపై కొందరు యువకులు ఓనమ్ ముగ్గును చెక్కారు.
  • ఇందుకోసం చిన్నపాటి సుత్తెలు, స్క్రూ డ్రైవర్లను ఉపయోగించారు. అంతా కలిసి చెక్కినా ఎక్కడా ఆకారం చెడకుండా అద్భుతంగా చిత్రీకరించారు. దాని కింద ఓనమ్ ఎట్ అంటార్కిటికా అనే అక్షరాలనూ చెక్కారు. చివరికి అంతా కలిసి ఆ ముగ్గు దగ్గర నిలబడి ఫొటోలకు పోజిచ్చారు.
  • దీనికి సంబంధించిన వీడియోను ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘ప్రపంచంలో ఎక్కడైనా సరే భారతీయులు ఓనమ్ పండుగను జరుపుకోకుండా ఆపలేం. అది అంటార్కిటికా అయినా సరే. చాలా బాగా రంగోలీ వేశారు..’ అని కామెంట్ పెట్టారు.
  • ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దానికి లక్షల కొద్దీ వ్యూస్, లైకులు వస్తున్నాయి.
  • ‘భారతీయులు అంటార్కిటికాలోనే కాదు చందమామపైనా ఓనమ్ పండుగను జరుపుకొనే సమయం దగ్గరలోనే ఉంది’ అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా.. ‘అద్భుతంగా వేశారు..’ అంటూ చాలా మంది ప్రశంసిస్తున్నారు.

  • Loading...

More Telugu News