Vishnu Vardhan Reddy: ఎన్టీఆర్ వంటి దేశభక్తుల పేర్లు మార్చడం కాదు... జిన్నా వంటి దేశద్రోహుల పేర్లు మార్చాలి: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

BJP leader Vishnu Vardhan Reddy comments on NTR Health University name change issue
  • హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై స్పందించిన విష్ణు
  • ఎన్టీఆర్ వర్సిటీకి ఎంతో చరిత్ర ఉందని వెల్లడి
  • చేతిలో అధికారం ఉందని నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శలు
  • జిన్నా టవర్ పేరు ఎందుకు మార్చరన్న బీజేపీ నేత
విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చుతూ అసెంబ్లీలో బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్చారు... రాష్ట్ర రాజధాని నడిబొడ్డున దిష్టిబొమ్మలాంటి జిన్నా టవర్ పేరు ఎందుకు మార్చరు? అంటూ నిలదీశారు. 

"ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాం నుంచి ఎంతో చరిత్ర కలిగిన ఎన్టీఆర్ వర్సిటీ పేరును మీ చేతిలో అధికారం ఉంది కదా అని మార్చేశారు. కానీ జిన్నా టవర్ పేరు మార్చలేకపోతున్నారు. జిన్నా టవర్ గురించి బీజేపీ మాట్లాడిన తర్వాత భయపడి రంగులు మార్చారు. పాకిస్థాన్ రంగు తీసేసి జాతీయ జెండా రంగు వేశారు తప్ప జిన్నా టవర్ పేరు మార్చలేదు. 

మీరు మార్చాల్సింది ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు కాదు.. ఈ దేశ చరిత్రలో నరహంతకుడిగా ముద్రపడిన ద్రోహి జిన్నా. వేలమంది ఊచకోతకు కారణమైన వ్యక్తి జిన్నా. ఇక్కడ తప్ప భారతదేశంలో ఎక్కడా జిన్నా టవర్లు, జిన్నా సెంటర్లు లేవు. ఎన్టీఆర్ వంటి దేశభక్తుల పేర్లు మార్చడం కాదు, చేతనైతే జిన్నా వంటి దేశద్రోహుల పేర్లు మార్చాలి" అని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. 

వైసీపీ ప్రభుత్వం దేశభక్తులకు అనుకూలమా, లేక దేశద్రోహులకు అనుకూలమా తేల్చుకోవాలని స్పష్టం చేశారు.
Vishnu Vardhan Reddy
NTR Health University
Name
Jinnah
BJP
YSRCP
Andhra Pradesh

More Telugu News