NTR: హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించడంపై నందమూరి కుటుంబం తీవ్ర అసంతృప్తి

Nandamuri family expresses dis satisfaction over NTR name removal
  • ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్సార్ పేరును పెట్టిన ఏపీ ప్రభుత్వం
  • పేరును తొలగించడాన్ని ఖండిస్తున్నామన్న ఎన్టీఆర్ కుటుంబం
  • అన్ని కులాలు, మతాలు, పార్టీలకు చెందిన వ్యక్తి ఎన్టీఆర్ అని వ్యాఖ్య
హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించి, వైఎస్సార్ పేరును ఏపీ ప్రభుత్వం పెట్టడంపై నందమూరి కుటుంబ సభ్యులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. యూనివర్శిటీని స్థాపించిందే ఎన్టీఆర్ అయినప్పుడు... ఆయన పేరును ఎలా తొలగిస్తారని వారు ప్రశ్నించారు. ఎన్టీఆర్ పేరును తొలగించడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. 

ఈ మేరకు ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ పేరిట నందమూరి కుటుంబం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇదొక దురదృష్టకరమైన పరిణామమని ప్రకటనలో వారు పేర్కొన్నారు. తెలుగు వారి ఆత్మాభిమానాన్ని నలుదిక్కులా చాటిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని వారు చెప్పారు. అన్ని కులాలు, మతాలు, పార్టీలకు చెందిన వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపారు. అలాంటి ఒక యుగపురుషుడి పేరును మార్చడం.. ముమ్మాటికీ తెలుగు జాతిని అవమానించినట్టేనని చెప్పారు.

మరోవైపు, ఎన్టీఆర్ పేరును తొలగించడంపై పార్టీలకు అతీతంగా అన్ని విపక్షాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ శ్రేణులు పలు చోట్ల ఆందోళన కార్యక్రమాలను చేపట్టాయి. ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్సార్ పేరును పెట్టడం వల్ల వచ్చే ఉపయోగం ఏమిటని ప్రభుత్వాన్ని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
NTR
Health University
Name Change
Nandamuri Family
Nandamuri Ramakrishna

More Telugu News