Uddhav Thackeray: ఉద్ధవ్ థాకరేతో భేటీ అయిన గౌతమ్ అదానీ

Gautam Adani Meets Uddhav Thackeray

  • మోదీ, అమిత్ షాలకు అత్యంత సన్నిహితుడు అదానీ
  • శివసేనను చీల్చి మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ
  • థాకరే, అదానీలు ఏం మాట్లాడుకున్నారనే విషయంపై రాని క్లారిటీ

మహారాష్ట్రలో ఎవరూ ఊహించని ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రపంచ శ్రీమంతుల్లో రెండో స్థానంలో ఉన్న వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ మాజీ ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేతో భేటీ అయ్యారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు గౌతమ్ అదానీ అత్యంత సన్నిహితుడు అనే విషయం అందరికీ తెలిసిందే. 

మరోవైపు, శివసేనను చీల్చి... ఆ పార్టీ రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేసిన సంగతి కూడా విదితమే. ఈ నేపథ్యంలో, థాకరేతో అదానీ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. థాకరేతో అదానీ సమావేశమైన విషయాన్ని అదానీ గ్రూప్ కు చెందిన ఒక ఉన్నతాధికారి తెలిపారు. అయితే, వీరిద్దరూ ఏయే అంశాలపై చర్చించారనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.

  • Loading...

More Telugu News