Caught On Camera: రోడ్డు దుస్థితిపై ఓపక్క వీడియో రిపోర్ట్ చేస్తుంటే.. మరోపక్క అక్కడి బురదలో ఆటో బోల్తా పడింది.. వైరల్ వీడియో ఇదిగో

Man rants about poor roads on camera e rickshaw overturns behind him
  • రోడ్లు బాగో లేవని, ప్రమాదాలు జరుగుతున్నాయని వీడియో తీస్తున్న రిపోర్టర్
  • అదే సమయంలో అక్కడి గుంతల వల్ల బోల్తా పడిన ఆటో
  • ఉత్తర ప్రదేశ్ లోని బల్లియా ప్రాంతంలో ఘటన 
ఏవైనా ఘటనలు జరిగినప్పుడు విలేకరులు సంబంధిత ప్రాంతాల వీడియోలు తీస్తుంటారు. అక్కడి పరిస్థితులను వీడియోలో వివరిస్తుంటారు. అలా ఓ ప్రాంతంలో గుంతల రోడ్లు, వాటితో జరుగుతున్న ప్రమాదాలపై రిపోర్టర్ న్యూస్ కవర్ చేస్తున్నారు. అక్కడి పరిస్థితిని చెబుతూ సెల్ఫీ వీడియో తీస్తున్నారు. ఆ వెనుక రోడ్డు అంతా గుంతలు పడి, బురదతో నిండి ఉంది. ఇదే సమయంలో అటుగా వస్తున్న ఓ ఎలక్ట్రిక్ ఆటో గుంతల మీదుగా వెళ్తూ.. బురదలోనే బోల్తా పడింది. అందులో ఉన్నవారంతా ఆ బురదలో పడిపోయారు.

తాత్కాలికంగా మరమ్మతు చేసి..
  • ఉత్తర ప్రదేశ్ లోని బల్లియా ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పీయూష్ రాయ్ అనే జర్నలిస్టు ఈ వీడియోను ట్విట్టర్ లో పెట్టారు.
  • ఇంతకుముందు ఈ ప్రాంతంలో పలు వాహనాలు పడిపోయాయని.. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆ వీడియోలోని వ్యక్తి చెబుతున్నారు. అలా చెబుతుండగానే వెనుక ఆ రోడ్డుపై వెళుతున్న ఆటో బోల్తా పడింది.
  • వెంటనే ఆయన వీడియో తీయడం ఆపేసి ఆటోలోని వారిని రక్షించే పనిలో పడ్డారు. ఆయనతో పాటు సమీపంలోని వ్యక్తులు బోల్తా పడిన ఆటోలోని వారిని బయటికి తీశారని తర్వాత ఆయన వివరించారు. ఘటన గురించి తెలిసి స్థానిక అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేసినట్టుగా తెలిపారు.
  • ట్విట్టర్ లో ఈ వీడియోకు నాలుగు లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. పెద్ద సంఖ్యలో లైక్ చేశారు.
Caught On Camera
E Auto Overturns
Twitter
Viral Videos
Offbeat
Uttar Pradesh

More Telugu News