Supreme Court: అక్టోబర్ 3 నుంచి సుప్రీంకోర్టుకు దసరా సెలవులు
- అక్టోబర్ 9 వరకు సుప్రీంకోర్టుకు దసరా సెలవులు
- తిరిగి అక్టోబర్ 10న తెరచుకోనున్న కోర్టు తలుపులు
- ప్రకటన జారీ చేసిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
దసరా పండుగను పురస్కరించుకుని సుప్రీంకోర్టుకు వారం రోజుల పాటు సెలవులు ప్రకటించారు. అక్టోబర్ 3 నుంచి మొదలు కానున్న ఈ సెలవులు 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి. దసరా సెలవులను ముగించుకుని సుప్రీంకోర్టు తిరిగి అక్టోబర్ 10 నుంచి యథాతథంగా పనిచేయనుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ దసరా సెలవులకు సంబంధించి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.