Avatar: భారత్ లో రీ రిలీజ్ లోనూ సత్తా చాటుతున్న 'అవతార్'
- 2009లో వచ్చిన అవతార్
- కలెక్షన్లలో అన్ని రికార్డులు తుడిచిపెట్టిన చిత్రం
- నేడు ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్
- అడ్వాన్స్ బుకింగ్ ద్వారా రూ.1.04 కోట్లు
పదమూడేళ్ల కిందట వచ్చిన అవతార్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. 237 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ 2.8 బిలియన్ డాలర్లు వసూలు చేసి కలెక్షన్లలో సరికొత్త రికార్డును సృష్టించింది.
తాజాగా ఈ చిత్రాన్ని నేడు (సెప్టెంబరు 23) మరోసారి రిలీజ్ చేశారు. అయినప్పటికీ భారీ కలెక్షన్లు సాధించడం అవతార్ సత్తాకు నిదర్శనం. ఒక్క భారత్ లోనే అడ్వాన్స్ బుకింగ్ ల రూపంలోనే ఈ చిత్రానికి 1 కోటి రూపాయలు వచ్చిపడ్డాయి. ఈ వారాంతం నాటికి దేశంలో రూ.5 కోట్లు వసూలు చేసే అవకాశలున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.
ఫ్రాన్స్, కొరియా, సౌదీ అరేబియా, బెల్జియం, ఫిలిప్పీన్స్ దేశాల్లోనూ అవతార్ కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది.
అవతార్ చిత్రాన్ని ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరాన్ తెరకెక్కించారు. ఇందులో శామ్ వర్దింగ్టన్, జో సల్దానా, సిగోర్నీ వీవర్, స్టీఫెన్ లాంగ్ తదితరులు నటించారు. అవతార్ తదుపరి భాగాలు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అవతార్-2 చిత్రం ఈ డిసెంబరులో విడుదల కానుంది.