BJP: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు వట్టి బూటకం: బీజేపీ విమర్శలు
- అక్టోబరు 17న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు
- ఎవరు గెలిచినా రిమోట్ సోనియా చేతుల్లోనే ఉంటుందన్న బీజేపీ
- అందుకు అశోక్ గెహ్లాట్ ట్వీటే నిదర్శనం అని వెల్లడి
త్వరలోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అందుకు నోటిఫికేషన్ కూడా వెలువడింది. ఈ నేపథ్యంలో బీజేపీ విమర్శనాస్త్రాలు సంధించింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ వట్టి బూటకం అని కొట్టిపారేసింది. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా స్పందిస్తూ, ఇదొక డొల్ల వ్యవహారం అని పేర్కొన్నారు.
ఎవరు కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టినా రిమోట్ కంట్రోల్ మాత్రం సోనియా చేతుల్లోనే ఉంటుందని అన్నారు. అందుకు అశోక్ గెహ్లాట్ ట్వీటే నిదర్శనమని షెహజాద్ పూనావాలా పేర్కొన్నారు. రాజస్థానీగా ఉన్న తాను (అశోక్ గెహ్లాట్) కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నెగ్గితే, తదుపరి రాజస్థాన్ సీఎం ఎవరన్నది సోనియా గాంధీ నిర్ణయిస్తారని గెహ్లాట్ చెప్పడం ఇదంతా ఓ ఫేక్ వ్యవహారం అని స్పష్టం చేస్తోందని వివరించారు.