Balakrishna: మార్చేయడానికి, తీసేయడానికి ఎన్టీఆర్ అన్నది పేరు కాదు.. తెలుగుజాతి వెన్నెముక: వైసీపీ ప్రభుత్వంపై బాలకృష్ణ ఫైర్

Balakrishna fires on NTR name removal

  • ఎన్టీఆర్ అంటే ఒక సంస్కృతి, ఒక నాగరికత అన్న బాలకృష్ణ 
  • తండ్రి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడు... కొడుకు యూనివర్శిటీ పేరు మారుస్తున్నాడని విమర్శ 
  • ఎన్టీఆర్ పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలు, పీతలు ఆ పార్టీలో ఉన్నారని వ్యాఖ్య 

విజయవాడలోని హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్సార్ పేరును పెట్టడం పెను దుమారాన్నే రేపింది. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా నందమూరి బాలకృష్ణ ప్రభుత్వంపై ఘాటుగా స్పందించారు. ఏపీ ప్రభుత్వంపై ఫేస్ బుక్ ద్వారా విరుచుకుపడ్డారు. 

మార్చేయడానికి, తీసేయడానికి ఎన్టీఆర్ అన్నది పేరు కాదని బాలయ్య అన్నారు. ఎన్టీఆర్ అంటే ఒక సంస్కృతి, ఒక నాగరికత, తెలుగుజాతి వెన్నెముక అని చెప్పారు. తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ (శంషాబాద్ విమానాశ్రయం) పేరు మార్చాడని... కొడుకు గద్దెనెక్కి యూనివర్శిటీ పేరు మారుస్తున్నాడని మండిపడ్డారు. 

మిమ్మల్ని మార్చడానికి ప్రజలున్నారని, పంచభూతాలున్నాయని, తస్మాత్ జాగ్రత్త అని బాలకృష్ణ హెచ్చరించారు. అక్కడ (వైసీపీలో) ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు, పీతలున్నారని ఎద్దేవా చేశారు. విశ్వాసం లేని వాళ్లని చూసి కుక్కలు కూడా వెక్కిరిస్తున్నాయని అన్నారు. శునకాల ముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు అని మండిపడ్డారు. 

తెలుగువాడి గుండెల్లో కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ ఉన్నట్టుగా కార్టూనిస్ట్ శ్రీధర్ వేసిన కార్టూన్ ను కూడా షేర్ చేశారు. 

  • Loading...

More Telugu News