t Manmohan Singh: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పిన మోదీ, రాహుల్

PM Modi and Rahul Gandhi greet Manmohan Singh on his birthday
  • నేడు 90వ పుట్టిన రోజు జ‌రుపుకుంటున్న మ‌న్మోహ‌న్‌
  • దీర్ఘాయుష్షుతో ఆరోగ్యంగా జీవించాలని మోదీ ట్వీట్
  • దేశ గొప్ప రాజ‌నీతిజ్ఞుల్లో ఒక‌రని రాహుల్ ప్ర‌శంస‌
భార‌త మాజీ ప్ర‌ధాన మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్‌ సోమ‌వారం తన 90వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో పాటు పలువురు రాజకీయ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. 'మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన దీర్ఘాయుష్షుతో ఆరోగ్యంగా జీవించాలని ప్రార్థిస్తున్నాను' అని మోదీ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కుడు రాహుల్ గాంధీ కూడా మ‌న్మోహ‌న్‌కు శుభాకాంక్షలు చెప్పారు. ఆయ‌న గొప్ప రాజ‌నీతిజ్ఞుడని ప్ర‌శంసిస్తూ ట్వీట్ చేశారు. 

'భారత అత్యుత్తమ రాజనీతిజ్ఞుల్లో ఒకరైన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికికి పుట్టినరోజు శుభాకాంక్షలు. దేశ అభివృద్ధిలో ఆయ‌న అంకితభావం, సహకారం మ‌రువ‌లేనివి. ఆయన నాతో పాటు కోట్లాది మంది భారతీయులకు స్ఫూర్తి. నేను ఆయ‌న ఆరోగ్యం, ఆనందం కోసం ప్రార్థిస్తున్నాను' అని రాహుల్ ట్వీట్ చేశారు. ఆర్థిక‌వేత్త‌గా పేరొందిన మ‌న్మోహ‌న్‌ రెండు ప‌ర్యాయాల యూపీఏ ప్ర‌భుత్వంలో ప‌దేళ్ల పాటు భార‌త ప్ర‌ధానిగా ప‌ని చేశారు.
t Manmohan Singh
birthday
Narendra Modi
Rahul Gandhi
tweet

More Telugu News