James Cameron: దశాబ్దం తర్వాత కూడా ‘అవతార్’ మూవీకి తగ్గని ఆదరణ

James Camerons Avatar re release garners Rs 244 crore at global box office
  • ఈ నెల 23న మళ్లీ థియేటర్ల ముందుకు వచ్చిన అవతార్ 2
  • పెద్ద ఎత్తున ప్రేక్షకుల నుంచి స్పందన
  • మూడు రోజుల్లోనే రూ.244 కోట్ల వసూళ్లు
అవతార్ సినిమాను సినీ అభిమానులు ఎప్పటికీ మరిచిపోరు. రొటీన్ సినిమాలు చూసి చూసి అప్పటికే బోర్ కొట్టేసి వున్న ప్రేక్షకులకు.. కథలో, చిత్రీకరణలో, టెక్నాలజీ వినియోగంలో కొత్త పుంతలు తొక్కుతూ.. కొత్తదనాన్ని పరిచయం చేసిందీ సినిమా. జేమ్స్ కామెరాన్ తన గొప్ప కళా నైపుణ్యాలను అవతార్ రూపంలో ప్రాణం పోశారు. 2009లో విడుదలైన ఈ మూవీ ప్రపంచంలో అత్యధిక కలెక్షన్లు సంపాదించిన సినిమాగా నిలిచిపోయింది. 

ఇదేమీ ముగిసిన అధ్యాయం అనుకోకండి. చాలా కాలం తర్వాత మరోసారి కొత్త రూపంలో అవతార్ (అవతార్ 2: ద వే ఆఫ్ వాటర్స్) సినిమాను ఈ నెల 23న థియేటర్లలో విడుదల చేశారు. 4కే హెచ్ డీఆర్ రూపంలో వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు ఈ విడత కూడా పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు. ఉత్తర అమెరికాలో 10 మిలియన్ డాలర్లు, అంతర్జాతీయంగా 20.5 మిలియన్ డాలర్లను మొదటి మూడు రోజుల్లోనే వసూలు చేసింది. అంటే సుమారు రూ.244 కోట్లు. తాజా కలెక్షన్లు కూడా కలిపి చూస్తే అవతార్ వసూలు చేసుకున్న మొత్తం 2.85 బిలియన్ డాలర్లు అవుతుంది. అంటే రూ.22,000 కోట్లు.
James Cameron
Avatar
movie
re release
box office
collections
Rs 244 crores

More Telugu News