Airtel: ఎయిర్ టెల్ అందిస్తున్న చౌక ప్లాన్లు.. వివరాలు ఇవిగో
- రూ.99, రూ.109, రూ.111 మూడు ప్లాన్లు
- అన్నింటిలోనూ రూ.99 టాక్ టైమ్ ఉచితం
- 200 ఎంబీ డేటా ఉచితం
- కాల్ చార్జీ సెకన్ కు 2.5 పైసలు
ఒకప్పుడు ఒక్కొక్కరి దగ్గర చాలా సిమ్ కార్డులు ఉండేవి. టెలికం కంపెనీలు ఒక్కొక్కటిగా మూత పడిపోవడంతో, టారిఫ్ లు పెరిగాయి. దీంతో చాలా మంది అదనపు సిమ్ కార్డులను రీచార్జ్ చేసుకోకుండా వదిలించుకున్నారు. అయినా ఇప్పటికీ చాలా మంది వద్ద రెండు సిమ్ కార్డులు ఉన్నాయి. ఒకటి మెయిన్ నంబర్ గా, రెండోది ప్రత్యామ్నాయ కాంటాక్ట్ కోసం ఉంచుకుంటున్నారు. కనుక రెండింటికీ అన్ని రకాల ప్రయోజనాలతో కూడిన రీచార్జ్ ప్లాన్ అవసరం లేదు. అటువంటి వారు తక్కువ చార్జీతో ఉండే నెలవారీ ప్లాన్ ను పరిశీలించొచ్చు. ఎయిర్ టెల్ లో మూడు రకాల చౌక ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.
రూ.99 ప్లాన్
28 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. ఇందులో రూ.99 టాక్ టామ్, 200 ఎంబీ డేటా ఉచితంగా లభిస్తుంది. ప్రతి సెకన్ కు కాల్ చార్జీగా 2.5 పైసలు పడుతుంది. ఒక్కో లోకల్ ఎస్ఎంఎస్ కు ఒక రూపాయి చార్జీ, ఎస్టీడీ ఎస్ఎంఎస్ కు రూ.1.5 చార్జీ ఉంటుంది. 200 ఎంబీ ఉచిత డేటా తర్వాత ప్రతి ఎంబీ డేటాకు 50 పైసలు చెల్లించుకోవాలి.
రూ.109 ప్లాన్
దీని వ్యాలిడిటీ 30 రోజులు. రూ.99 టాక్ టైమ్ వస్తుంది. అలాగే, 200 ఎంబీ డేటా ఉచితం. అన్ని రకాల కాల్స్ కు సెకన్ కు 2.5 పైసల చార్జీ పడుతుంది. ఒక్కో ఎస్ఎంఎస్ చార్జీ రూ.1.
రూ.111 ప్లాన్
దీని కాల వ్యవధి 31 రోజులు. అంటే ప్రతి నెలా ఒకే తేదీన రీచార్జ్ చేసుకోవాలి. ఇందులోనూ రూ.99 టాక్ టైమ్ లభిస్తుంది. ఒక్కో సెకన్ కు కాల్ చార్జీగా 2.5 పైసలు పడుతుంది. 200 ఎండీ డేటా ఉచితం. ఒక్కో లోకల్ ఎస్ఎంఎస్ కు ఒక రూపాయి చార్జీ, ఎస్టీడీ ఎస్ఎంఎస్ కు రూ.1.5 చార్జీ ఉంటుంది.