Gehlot: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి గెహ్లాట్ కు తలుపులు మూసుకున్నట్టే!
- తెరపైకి కమల్ నాథ్, ముకుల్ వాస్నిక్, ఖర్గే, దిగ్విజయ్ సింగ్
- గెహ్లాట్ పట్ల పార్టీలో సన్నగిల్లిన విశ్వాసం
- రాహుల్ గాంధీతో చర్చించిన సీనియర్ నేతలు
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ప్రధాన పోటీదారుగా ఉన్న రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ రేసు నుంచి తప్పుకోవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. తాను కాంగ్రెస్ అధ్యక్షుడిని అయితే తన వారసుడిగా, తన అనుచరుడినే సీఎం పీఠంలో కూర్చోబెట్టాలన్నది ఆయన ఎత్తుగడ.
ఈ క్రమంలో తన మద్దతుదారులతో కలసి పార్టీని ఇరకాటంలో పడేశారు. ఒక రకంగా పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి ఇబ్బందికర పరిస్థితిని తెచ్చిపెట్టారు. సచిన్ పైలట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం కానివ్వకూడదన్నది ఆయన వ్యూహం. దీంతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోనే గెహ్లాట్ కు వ్యతిరేకంగా స్వరాలు వినిపించాయి.