Telangana: రూ.58 లక్షల జీతంతో ఉద్యోగంలో చేరబోతున్న సమయంలో.. టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ తనయుడి ఆకస్మిక మృతి!
- వరంగల్ ఎన్ఐటీలో కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభిజిత్ రెడ్డి
- దుబాయ్ లోని ఆయిల్ కంపెనీలో ఉద్యోగానికి ఎంపిక
- కార్డియాక్ అరెస్ట్ తో మృతి చెందిన అభిజిత్
ఎంతో ప్రతిభావంతుడైన తెలంగాణ యువకుడు కార్డియాక్ అరెస్ట్ తో హఠాన్మరణం చెందడం అందరినీ కలచి వేస్తోంది. వివరాల్లోకి వెళ్తే వరంగల్ ఎన్ఐఐటీలో అభిజిత్ రెడ్డి (22) కెమికల్ ఇంజినీరింగ్ లో బీటెక్ పూర్తి చేశాడు. తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) ఎండీ కె.చంద్రశేఖర్ రెడ్డికి అభిజిత్ పెద్ద కొడుకు. దుబాయ్ లోని ఓ ఆయిల్ కంపెనీలో ఏడాదికి రూ. 58 లక్షల వేతనంతో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. వచ్చే నెలలో ఆయన ఉద్యోగంలో చేరాల్సి ఉంది.
అంతా సంతోషకరంగా కొనసాగుతున్న తరుణంలో విధి వక్రీకరించింది. అభిజిత్ రెడ్డి ఛాతీలో ఇబ్బందికి గురయ్యాడు. కుప్పకూలిపోయాడు. ఆయన కుటుంబ సభ్యులు ఆయనకు వెంటనే సీపీఆర్ చేశారు. అనంతరం వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. కార్డియాక్ అటాక్ తో ఆయన చనిపోయినట్టు తెలిపారు.
మరోవైపు కార్డియాలజిస్ట్ డాక్టర్ వైపీ రెడ్డి మాట్లాడుతూ... ప్రస్తుతం యువత అనేక కారణాల వల్ల హార్ట్ అటాక్ కు గురవుతున్నారని చెప్పారు.