Jagan: నంద్యాల జిల్లాలో రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీని ప్రారంభించిన జగన్

Jagan opens Ramco Cements

  • నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలో ఫ్యాక్టరీ ప్రారంభం
  • పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్న జగన్
  • ఈ ఫ్యాక్టరీతో వెయ్యి మందికి ఉద్యోగాలు వస్తాయని వ్యాఖ్య

నంద్యాల జిల్లా, కొలిమిగుండ్ల మండలం కల్వటాల గ్రామ సమీపంలో రూ.1790 కోట్లతో నెలకొల్పిన రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని చెప్పారు. ఒక పరిశ్రమ రావడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని... స్థానికులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని అన్నారు. రామ్ కో సిమెంట్ పరిశ్రమతో వెయ్యి మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ఏపీనే ఉదాహరణ అని అన్నారు. 

పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ మాట్లాడుతూ... పారిశ్రామిక అభివృద్ధితో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న చర్యలతో రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా వస్తున్నాయని కొనియాడారు. పరిశ్రమలకు తమ ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకాలను ఇస్తోందని చెప్పారు.

  • Loading...

More Telugu News