TDP: నారా బ్రాహ్మణిపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు.. పట్టుకుని దేహశుద్ధి చేసిన టీడీపీ నేతలు

Man who Posts abused comments on facebook attacked by tdp leaders
  • ఖమ్మం జిల్లా టేకులపల్లిలో ఆర్ఎంపీగా పనిచేస్తున్న కోదాటి నరసింహ
  • ఫేస్‌బుక్ పేజీలో బ్రాహ్మణిని కించపరుస్తూ పోస్టులు
  • ప్రశ్నించిన టీడీపీ నాయకులకు దురుసు సమాధానం
  • పట్టుకుని చితక్కొట్టిన టీడీపీ నేతలు
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడి కోడలు నారా బ్రాహ్మణిపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వ్యక్తికి టీడీపీ నేతలు దేహశుద్ధి చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లాకు చెందిన కోదాటి నరసింహ ఖమ్మం జిల్లా టేకులపల్లిలో ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. ఆయన తన ఫేస్‌బుక్ పేజీలో నారా బ్రాహ్మణిని వ్యక్తిగతంతా కించపరుస్తూ పోస్టులు పెట్టారు. విషయం తెలిసిన పలువురు టీడీపీ నాయకులు నరసింహకు ఫోన్ చేసి ఎందుకిలాంటి పోస్టులు పెడుతున్నావని, ఎక్కడున్నావని ప్రశ్నించారు. 

తాను ముస్తఫానగర్ వైతెపా కార్యాలయంలో ఉన్నానని చెప్పడంతో వారు అక్కడికి వెళ్లారు. బ్రాహ్మణిని వ్యక్తిగతంగా కించపరుస్తూ పోస్టులు ఎందుకు పెడుతున్నావని ప్రశ్నించారు. దానికి నరసింహ దురుసుగా సమాధానం చెప్పడంతో వాగ్వివాదం మొదలైంది. దీంతో ఆగ్రహానికి గురైన టీడీపీ నాయకులు, తెలుగు యువత కార్యకర్తలు నరసింహను పట్టుకుని దేహశుద్ధి చేశారు.
TDP
Chandrababu
Nara Brahmani
Facebook

More Telugu News