Uber: ఈ ఊబర్ ట్యాక్సీ డ్రైవర్ కు.. భయ్యా, అంకుల్ అని పిలిస్తే నచ్చదట!

Uber reacts to drivers Dont call me bhaya notice on seats headrest

  • కారు సీటు వెనుక భాగంలో రాయించిన డ్రైవర్
  • దీన్ని ట్విట్టర్లో షేర్ చేసిన బిజినెస్ జర్నలిస్ట్ సోహిని
  • పేరుతో పిలిస్తే పోదూ అంటూ సూచన చేసిన ఊబర్

30 ప్లస్ వయసులో ఉన్నవారిని అంకుల్ అనో.. లేదా ఆంటీ అనో అంటే వారికి తెగ కోపం వచ్చేస్తుంది. ఈ ఊబర్ డ్రైవర్ కూడా ఇదే రకం. ఏకంగా తాను నడిపే ట్యాక్సీ సీట్ హెడ్ రెస్ట్ వెనుక ‘డోంట్ కాల్ మీ భయ్యా అండ్ అంకుల్’ అని పెయింట్ తో రాయించేసుకున్నాడు. నన్ను అన్నా అని పిలవొద్దు. అంకుల్ అని కూడా పిలవకండన్నది అతడి సూచన. 

దీన్ని బిజినెస్ జర్నలిస్ట్ అయిన సోహిని ఎం ట్విట్టర్లో షేర్ చేయగా, నెటిజన్ల నుంచి భిన్న రకాల స్పందనలు వస్తున్నాయి. ఈ పోస్ట్ ను ఊబర్ ఇండియాకు ఆమె ట్యాగ్ చేశారు. దీంతో ఊబర్ ఇండియా కూడా స్పందించక తప్పలేదు. ఈ రెండింటికి బదులు ప్రత్యామ్నాయం పరిశీలించొచ్చుగా? అని సూచించింది. యాప్ లో ట్రిప్ బుకింగ్ దగ్గర కనిపించే పేరుతో డ్రైవర్ ను పిలిస్తే పోదూ? అంటూ స్పందించింది. 

వృత్తి, స్థానంతో సంబంధం లేకుండా, మానవత్వాన్ని గౌరవించడం ముఖ్యమని ఓ యూజర్ స్పందించాడు. తాను సాధారణంగా పేరు పక్కన జీ పెట్టి పిలుస్తానని ఓ యూజర్ కామెంట్ చేయగా.. నేను అయితే కార్ సర్ అని పిలుస్తానంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు.

  • Loading...

More Telugu News