WhatsApp: వాట్సాప్ లో డిలీటెడ్ మెస్సేజ్ లను సైతం చూడొచ్చు!

WhatsApp trick How to read deleted messages
  • ఒకరికి మెస్సేజ్ పంపి వారు చూడకముందే డిలీట్ చేయొచ్చు
  • ఈ తరహా మెస్సేజ్ లను తెలుసుకునేందుకు ప్రత్యేకంగా యాప్
  • గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకుంటే సరి
వాట్సాప్ అకౌంట్ లేని స్మార్ట్ ఫోన్ ఉండదు. వ్యక్తులు, వ్యాపారులు-కస్టమర్ల మధ్య సంబంధాల వారధిగా మారిపోయిన వాట్సాప్ విషయంలో ఉపయోగపడే ట్రిక్స్ ఎన్నో ఉన్నాయి. ఎవరైనా ఒకరు మనకు ఏదో ఒక సందేశం పంపించి, దాన్ని మనం చూడకముందే డిలీట్ చేశారనుకోండి.. అప్పుడు వారు మనకు ఏమి మెస్సేజ్ చేసి ఉంటారబ్బా? అన్న ఆసక్తి ఏర్పడుతుంది. 

ఒకరు మనకు మెస్సేస్ పంపించి, డిలీట్ చేస్తే.. మెస్సేజ్ వాజ్ డీలీటెడ్ అని కనిపిస్తుంది. కనుక ఈ తరహా డిలీటెడ్ మెస్సేజ్ లను చూసేందుకు ఒక మార్గం ఉంది. గూగుల్ ప్లే స్టోర్ కు వెళ్లి ‘గెట్ డిలీటెడ్ మెస్సేజెస్’ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. యాప్ అడిగిన పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో యాప్ ఇన్ స్టాల్ అవుతుంది. తర్వాత వాట్సాప్ లో ఎవరైనా మెస్సేజ్ చేసి డిలీట్ చేశారనుకోండి.. అప్పుడు ఈ యాప్ కు వెళ్లి డిలీటెడ్ మెస్సేజెస్ చూడొచ్చు. కాకపోతే ఈ యాప్ బ్యాక్ గ్రౌండ్ లో రన్ అయ్యేందుకు, ఇతర పర్మిషన్స్ అడుగుతుంది. కనుక డేటాకు భద్రత ఉండదని గుర్తుంచుకోవాలి.
WhatsApp
trick
deleted messages
can read

More Telugu News